మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి గెలిచిన సందర్భంగా కోటగుమ్మం సెంటర్ లో శనివారం పార్టీ విజయోత్సవ సంబరాలు జరిపింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ మహారాష్ట్ర గెలుపుతో దేశంలో రాజకీయంగా పెను మార్పులు జరగబోతున్నాయని అన్నారు.