సీఎం సహాయనిధి ద్వారా పేదలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని పిఠాపురం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యు. కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన చింతపల్లి లోవ నేరెళ్ల రెడ్డి తుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 98,916 మంజూరైన చెక్కును బాధితుడికి ఇన్‌ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ అందజేశారు.