పిఠాపురం నియోజకవర్గంలో డీఎస్సీకి సిద్ధమయ్యే వారికి ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. బుధవారం స్థానిక తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అవసరమైన వారు 8978869999 ఫోన్ నంబరులో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.