దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అర్హులందరికీ అందిస్తామని ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలోని శుక్రవారం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత సిలిండర్ ను ఆయన మహిళకు అందించారు.
తెదేపా,
జనసేన, భాజపా మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తుతో మిగిలిన పధకాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.