జనసేన కోసం కష్టపడిన తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడం అన్యాయమని ఆ పార్టీ నాయకుడు పీఎస్ఎన్ మూర్తి అన్నారు. పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో శనివారం మాట్లాడుతూ పిఠాపురం అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో జనసేన నుంచి ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తే కనీసం తననూ ఎవరూ సంప్రదించలేదన్నారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించానని క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ తనకు నోటీసు జారీ చేయడం బాధాకరమన్నారు.