వైసీపీకి పార్టీకీ రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు

74பார்த்தது
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తన్ను వెన్ను వుంటి నడిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎటువంటి స్వలోభాలకు ఆశపడి రాజీనామా చేయలేదని, వెన్నుపోటు రాజకీయాలు చేయడం తమకు తెలియదన్నారు. వీలైనంత త్వరలోనే తమ కేడర్ సభ్యులతో సమావేశమై భవిష్యత్ ప్రణాళికను తెలియజేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி