సంక్షేమం, అభివృద్ధిని వేగవంతం చేస్తూ.. వంద రోజులు పాలనలో ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రజల మన్ననలు పొందడం ప్రభుత్వ ఘనతని కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పెద్దాపురం మండలం పులిమేర గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో ఎంపీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన స్పూర్తి, ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలు వివరించి, చేయబోతున్న కార్యక్రమాలు వివరిస్తున్నామన్నారు.