పెద్దాపురం మండలం తొలి తిరుపతి క్షేత్రంలో శృంగార వల్లభ స్వామిని బుధవారం జబర్దస్త్ టీం లీడర్ రాజు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో వడ్డీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకుడు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణచార్యులు, రైజింగ్ రాజు దంపతుల పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద ఆశీస్సులు, స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. స్వామిని దర్శించడం ఆనందదాయకమని జబర్దస్త్ రాజు మీడియాకు తెలిపారు.