సామర్లకోట బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పలు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో దొంగలున్నారు జాగ్రత్త పేరుతో జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు మైక్ ను ఏర్పాటు చేసినట్లు శనివారం సామర్లకోట ట్రాఫిక్ ఎస్ఐ గరగారావు తెలిపారు. బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో నిత్యం రద్దీ ఉన్న నేపథ్యంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ గరగారావు పేర్కొన్నారు