అంగన్వాడీ కేంద్రాలద్వారా అమలు చేస్తున్న పోషకాహార పధకాలపై ప్రజలకు, లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని సెక్టార్ సూపర్ వైజర్ మంగ పిలుపునిచ్చారు. సామర్లకోట పట్టణంలోని బ్రౌన్ పేట సెక్టార్ పరిధిలో బలుసులపేటలో పోషకాహార మాసోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. తొలుత పోషకాహారం పై గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో "స్వచ్ఛతా హీ సేవా" పేరుతో వీదుల్లో ర్యాలీలు నిర్వహించి పరిసరాల పరిశుభ్రత పై నినాదాలిచ్చారు.