కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం జొన్నాడ వద్ద నిర్మాణం చేపట్టిన ఫ్లై ఓవర్ పనులపై జాతీయ రహదారి అధికారులతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని, ఈ నిర్మాణానికి ఇరు వైపులా రోడ్డు గోతులమయం అవ్వడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.