విద్యార్థులు అసాంఘిక చర్యలకులోనూ కాకుండా చదువు, తద్వారా భవిష్యత్తు ఉన్నతి పై దృష్టి సారించాలని రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ ఉద్బోధించారు. కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఫోక్సో, గంజాయి, మత్తు పదార్థాలు, వాహన చట్టం, ఈవ్ టీజింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి. సురేంద్ర, ప్రిన్సిపల్ వై. లక్ష్మణరావు, ఏఎస్ఐ అడబాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.