కొత్తపేట బోడిపాలెం వంతెన నుండి పలివెల వంతెన వరకు ఉన్న కౌశిక డ్రైన్ ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్త చెదారంతో మూసుకుపోయాయి. సంబంధిత డ్రైనేజీ శాఖ అధికారులు డ్రైన్ ల పర్యవేక్షణలో విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఇప్పటికే డ్రైనేజీని ఆక్రమించుకుని షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తక్షణం డ్రైనేజీ ఆక్రమణలు తొలగించి పూడికతీత పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.