ఆలమూరు మండల పరిధిలోని పెదపళ్ళ ఆర్ అండ్ బి రోడ్డుపై మంగళవారం ఓఎన్జిసి వాహనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై ఎం. అశోక్ హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ వాహనం రాక ఆలస్యం కావడంతో సిఐ విద్యాసాగర్ చొరవ తీసుకుని రోడ్డు పక్కన ఇంటి నుండి వాటర్ ట్యూబ్ ద్వారా మంటలను అదుపు చేశారు. మంటల వ్యాప్తికి గల కారణాలు తెలియాల్సి ఉంది.