104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, 104 వైద్య సేవలను పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ద్వారా వైద్య సేవలు అందించాలని, తమ డిమాండ్లు పరిష్కరించాలని గురువారం కరప ఎమ్మార్వో సత్యనారాయణకు 104 ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, కుటుంబాలను పోషించటం చాలా కష్టమవుతుందని అన్నారు.