తెలుగుదేశం పార్టీ తన వైఖరిని మార్చుకోవాలని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు సూచించారు. సోషల్ మీడియాలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాకినాడలో జిల్లా అడిషనల్ ఎస్పీకి శనివారం కన్నబాబు ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడిపి కక్ష సాధింపు ధోరణిని మానుకోవాలని హితవు పలికారు.