కాకినాడ అచ్చంపేట సెంటర్ అశోక్ లైలాండ్ ఎదురుగా ఉన్న టీ హౌస్ లో శుక్రవారం తెల్లవారుజామున దొంగల పడి నగదు, విలువైన వస్తువుల ను దొంగిలించారు. కిటికీ అద్దాలను పగలకొట్టి షాప్ లోకి ప్రవేశించి దొంగతనం చేసినట్లు షాపు యజమాని పోలీసులకు పిర్యాదు చేశారు. టీ షాప్ యాజమాన్యం ఒక వ్యక్తిని పట్టుకుని తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.