కులమతాలకు అతీతంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామంలో బాల గణపతి కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నానాజీ మాట్లాడారు. విద్య, వైద్యం, తాగునీరు తదితర కనీస వసతులు కల్పించడమే తన లక్ష్యమని అన్నారు.