రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదివారం కాకినాడలో జరిగిన వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వనసమారాధన కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాశ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు నాయకులంతా హాజరుకావడం ఆనందకరమని అన్నారు.