వైసీపీ అధికారంలో ఉండగా ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఏ నియోజకవర్గంలో లేని విధంగా టీడీపీ కార్యకర్తలను హింసించారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ఎన్డీయే కూటమి కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై 39 కేసులు, తమ కార్యకర్తలపై 185 కేసులు పెట్టడమే కాకుండా తనను అంతమొందించడానికి సుపారి కూడా ఇచ్చారని ఆరోపించారు.