అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రిలోని తూ. గో జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రశాంతిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలోని కాకినాడ- రాజమండ్రి రహదారి, మరో మూడు ప్రధాన రహదారుల అభివృద్ధికి సెంట్రల్ రోడ్ ఫండ్స్ కింద నిధులు మంజూరు కోసం అధికారుల రూపొందించిన ప్రతిపాదనలు పంపించడం పై కలెక్టర్‌తో చర్చించారు. ఆర్&బి అధికారులు పాల్గొన్నారు.