అక్రమంగా మద్యం సీసాలు నిర్వహిస్తున్న ఓ దుకాణంపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. అనపర్తి సీఐ శివ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం అనపర్తి లోని ఓ దుకాణంలో ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి మద్యం సీసాలు కొనుగోలు చేసి, విక్రయాలు జరుపుతుండగా, తమకు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించి, 135 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దుకాణ యజమాని పై కేసు నమోదు చేశామన్నారు.
.