నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలులోని ప్రసిద్ధ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వెళ్ళిన ఎమ్మెల్యే దంపతులు ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రం కప్పి సత్కరించారు.