తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు అనపర్తి పాతఊరులోని త్రిశక్తి పీఠం వద్ద సోమవారం వైభవంగా జరిగాయి. కర్రీ శేషారత్నం ఆధ్వర్యంలో భవాని దీక్షాపరులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల పూలతో చేసిన బతుకమ్మలను చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతూ సంబరాలు జరుపుకున్నారు. గౌరీ దేవిని పుష్పాలతో అలంకరించి గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ నదీ జలాల్లో విడిచిపెట్టారు.