తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ అపవిత్రమైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండ మండలంలోని గాదరాడ గ్రామంలో ఉన్న ఆయన నివాసం వద్ద శుక్రవారం మహాయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.