రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వెంకటరమణ చౌదరి శుక్రవారం విజయవాడ వరద సహాయ చర్యలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు.