సీతానగరం గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానంలో ఎటువంటి జాప్యాలు, అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.