రాజానగరంలో వినాయక చవితి సందర్బంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్ధి వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు ఉన్నారు.