రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల మహాలక్ష్మి ఈనెల 19, 20 తేదీల్లో రాజమండ్రిలో పర్యటించనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారి విజయ కుమారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె రాజమండ్రి సెంట్రల్ జైలులో మహిళల సెల్లు పరిశీలిస్తారని తెలిపారు. అదేవిధంగా ఆర్&బి అతిథి గృహం వద్ద సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు.