Oct 16, 2024, 04:10 IST/
60 మందిని రక్షించి.. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
Oct 16, 2024, 04:10 IST
ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సులోనే మృతిచెందాడు. బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రేపల్లె నుంచి చీరాల వెళుతోంది. బస్సు కర్లపాలెం దాటిన తర్వాత డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అయితే, బస్సును వెంటనే పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి ఆపాడు. ఈ క్రమంలో డ్రైవర్ డి.సాంబశివరావు మృత్యువాత పడ్డారు. కాగా, బస్సులో ఉన్న సుమారు 60 మంది క్షేమంగా బయట పడ్డారు.