రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బివిఆర్ చౌదరి
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల రెండో లిస్టులో తూర్పుగోదావరి జిల్లాలో పలువురు నేతలకు పదవులు వరించాయి. దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్, అనపర్తి నియోజకవర్గం పెద్దాడ గ్రామానికి చెందిన బొడ్డు వెంకట రమణ చౌదరిని రాజమండ్రి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.