చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్ లోని జీకే. నగర్ వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న గణేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ నెట్టి కంఠయ్య సోమవారం తెలిపారు. అతని నుంచి రూ. 30 వేల విలువచేసే 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించామన్నారు. అతనికి గంజాయి సరఫరా చేస్తున్న అయ్యప్ప అనే వ్యక్తి పరారీలో ఉన్నారన్నారు. త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.