పరవాడ: సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో
పరవాడ ఠాగూర్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పరవాడ మండలం లంకెలపాలెంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు.