పెందుర్తి మండలం వేపగుంట సచివాలయం పరిధిలో ఇళ్లు లేని పేదలు ఇళ్ల స్థలాల కోసం సచివాలయంలో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన సిపిఐ నాయకులు ఆర్ శ్రీనివాస్, వై రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు.