యస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం "వరల్డ్ స్ట్రోక్ డే"కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో డాక్టర్ వాసంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఎక్కువగా ఉప్పు, మసాలా, ఎక్కువ నూనెతో కూడిన ఆహారాన్ని నిలవ పచ్చళ్ళు తీసుకురాదన్నారు. ఇందువలన మానసిక ఒత్తిడికి లోనై బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందన్నారు.