విశాఖ: రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
దక్షిణ నియోజకవర్గం 41 వ వార్డు సెబాస్టియన్ కాలనీ నుంచి బాబు కాలనీ వరకు రహదారి నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 20 లక్షలతో రహదారిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.