పిల్లల్లో సృజనాత్మకత పెరగడానికి పుస్తక పఠనం ఎంతో అవసరం అని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ హవా మహల్ లో 5వ వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ను శనివారం సాయంత్రం జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలిచేది పుస్తకం అన్నారు. పుస్తకం భాష నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి తనకు సహాయపడిందన్నారు. పుస్తక పఠనం ప్రాముఖ్యతను తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలన్నారు.