విశాఖ: శారదా పీఠం భూముల స్వాధీనం
విశాఖలోని పెందుర్తి శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం భీముని పట్నం మండలం కొత్తవలస గ్రామంలో కేటాయించిన 15 ఎకరాల భూముల్ని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సుమారు రూ.225 కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరకు కేటాయించడంతో పాటు కేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించడంతో భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ భూముల్లో విశాఖ జిల్లా యంత్రాంగం హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేసింది