ప్రజలు సోలార్ విద్యుత్ ను వినియోగించుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు సూచించారు. సబ్బవరం మండలం గుల్లేపల్లిలో గురువారం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రాయితీతో ప్రజలు తమ ఇళ్లపై సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీనివల్ల విద్యుత్ బిల్లులు తగ్గుతాయన్నారు.