అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో గల సబ్బవరం మండలం గొల్లలపాలెం, పైడివాడ అగ్రహారం గ్రామాలలో రూరల్ అర్బన్ హౌసింగ్ నిర్మాణాలను, వాటి నాణ్యతను గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పరిశీలించారు. ఆయన జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఆయా గ్రామాలలో నిర్మాణంలో వున్న ఇళ్లను పరిశీలించి అనంతరం సబ్బవరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.