కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని లేబర్ ఆఫీసర్ పీ. సత్యనారాయణ అన్నారు. గురువారం కార్మిక శాఖ, ఐసీడీఎస్, పోలీస్ శాఖలతో కలిసి సబ్బవరంలోని పలు దుకాణాలు, మెకానిక్ షాపులు, డాబా, హోటళ్లను తనిఖీలు చేపట్టారు. సత్యనారాయణ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండని బాలలను పనుల్లో పెట్టుకుంటే సంబంధిత యాజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దివ్య, సీడీపీవో లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.