రాయలసీమ కూడా ఏపీకి చెందినదేనని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య అన్నారు. పెందుర్తిలో శనివారం మాట్లాడుతూ రాయలసీమలో పెళ్లయిన ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఉండదని ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్టీఆర్ ఎప్పుడో ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం చేసినట్లు తెలిపారు. వాడుకొని వదిలేయడం జగన్ కు అలవాటని విమర్శించారు. వైయస్ కుటుంబంపై ఒక పుస్తకాన్ని ప్రచురించాలన్నారు.