అన్ని ఆప్షన్లు వాడేసుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డికి ఇక ఆప్షన్లు లేవని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య వ్యాఖ్యానించారు. పెందుర్తిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ చివరి ఆప్షన్ జగన్ జైలుకు వెళ్లడమేనని అన్నారు. వ్యవస్థలను నాశనం చేసిన జగన్ నీతులు మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.