సిద్ధమైన పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం వాటాలతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ. 500 కోట్ల వ్యయంతో భారీ నిర్మాణాలను పాడేరు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో ప్రభుత్వాలు చేపట్టాయి. గత ప్రభుత్వంలో నిర్మాణాల్లో జాప్యం కాగా కూటమి ప్రభుత్వంలో నిర్మాణాలు వేగవంతమయ్యాయి. 50 సీట్లు అనుమతితో ప్రభుత్వ వైద్య కళాశాల త్వరలో ప్రారంభం కాబోతోంది.