అల్లూరి జిల్లా కలెక్టర్, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి ఆదేశానుసారం శుక్రవారం సాయంత్రం విశాఖ కె. జి. హెచ్ లో ఉన్న ట్రైబల్ సెల్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జమాల్ భాషా ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు గాయాలపాలై కె. జి. హెచ్ లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసారు.