ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు గ్రామ సచివాలయ సిబ్బంది సైతం, స్థానిక ప్రజాప్రతినిధులకు జవాబుదారీగానే పనిచేయాలని కోయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అల్పపీడనం తుఫాన్ ప్రభావాలతో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రహదారులు, పంటలు, విద్య వైద్యం విద్యుత్ ఉపాధి హామీ శాఖలపై సమీక్ష నిర్వహించారు.