అల్లూరి జిల్లా పాడేరులో వెలిసినటువంటి అతి పురాతనమైన శ్రీ ఉమ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని అరకు పార్లమెంట్ ఎంపీ గుమ్మా తనూజ రాణి కుటుంబ సభ్యులతో శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, ఉప అధ్యక్షులు కొత్తగుల్లి రామారావు, సత్యవరపు సోమరాజు, జవ్వాది త్రినాథ్, అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.