మినీ అంగన్వాడీ సెంటర్లనుమెయినన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. వేలాది మంది మినీ వర్కర్లు పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ప్రదాన గేటు వద్ద భైఠాయించి, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సుందరరావు మాట్లాడుతూ.. మినీ వర్కర్లకు ఖాళీ పోస్టుల్లో ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.