దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని పాడేరులో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇస్తున్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్లలో మొదటిది బుక్ చేసుకున్న ఒకటి రెండ్రోజుల్లో వస్తుందన్నారు. ఇక దీనికి లబ్దిదారులు మొదట పూర్తిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, సిలిండర్ డెలవరీ చేసిన 2రోజుల్లో లబ్దదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు కలెక్టర్.