సెప్టెంబర్ 24న పెదబయలులో ఉపాధ్యాయుని కుటుంబంపై దాడి ఘటన, దానికి ముందు ఉపాధ్యాయునిపై జరిగిన దాడి ఘటనలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి అధికారులు తీసుకున్న నిర్ణయం సహేతుకంగా లేదని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. పాడేరు ఐటిడిఏ వద్ద ఈశ్వరి ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయకుండా క్యాస్ట్ ఫీలింగ్ కల్పించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు.